బ్రెజిల్ స్కూల్లో కాల్పులు : 8 మంది విద్యార్థులు మృతి

SMTV Desk 2019-03-14 14:25:24  brazil, savo poulo, school, sun firing, students died, Brazil school shooting

బ్రెజిల్, మార్చ్ 14: బుధవారం బ్రెజిల్ సావో పౌలో ప్రాంతానికి దగ్గర్లోని ఒక స్కూల్లో ఇద్దరు దుండగులు కాలుపు జరిపారు. ఈ దారుణ సంఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు మరణించారు. 15 మంది గాయపడ్డారని మిలిటరీ పోలీసులు చెప్పారు. స్కూల్లో దురాగతానికి పాల్పడిన ఇద్దరు షూటర్లూ ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని గవర్నర్ జోవా దోరియా వెల్లడించారు. చనిపోయిన విద్యార్థుల వయసు 15 నుంచి 16 మధ్య ఉంటుందని స్కూల్ యాజమాన్యం తెలిపింది.