విశాల్ ఎంగేజ్మెంట్ ఫిక్స్

SMTV Desk 2019-03-14 14:23:53  Vishal, Tamil Hero Vishal

చెన్నై, మార్చ్ 14: తమిళ ఇండస్ట్రీలో ప్ర‌స్తుతం పెళ్ళిళ్ళ సీజ‌న్ జోరు కొనసాగుతుంది. రీసెంట్‌ గా హీరో ఆర్య‌ - హీరోయిన్ సాయేషా సైగ‌ల్ ల వివాహం హైద‌రాబాద్ లోని ఫలక్ నామా పాలెస్ లో జ‌ర‌గగా, త్వ‌ర‌లో విశాల్ ఎంగేజ్మెంట్ కూడా ఇక్క‌డే జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె కొన్ని సినిమాల్లో నటించిన అనీషా రెడ్డి ఆళ్ళతో విశాల్ పెళ్లి ఫిక్స అయినదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరి నిశ్చితార్ధం మార్చి 16న అంటే ఈ శనివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నార‌ని సమాచారం. అయితే ఇది కాస్త గోప్యంగా జరగనుందని కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వేడుకకి హాజరవనున్నారట. ఇక‌ పెళ్ళి ఈ ఏడాది జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గ వ్యవహరిస్తున్న విశాల్ తమిళ నడిగర్ సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటాన‌ని శపధం చేశారు. ప్ర‌స్తుతం బిల్డింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నా ఆ పనులు ఈ ఏడాదిలో పూర్తయ్యే అవకశాలు కనపడడం లేదు. బిల్డింగ్ పూర్తైన త‌ర్వాత‌నే అంటే వచ్చే ఏడాదిలోనే విశాల్ వివాహం చేసుకోనున్నాడ‌ని టాక్ . ప్ర‌స్తుతం విశాల్ తెలుగు టెంపర్ రీమేక్ అయోగ్య చిత్రంలో న‌టిస్తున్నాడు. ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఒక సాంగ్ షూట్ లో ఆయన గాయాల పాలయ్యాడు కూడా.