పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మావోయిస్ట్ డంపు స్వాధీనం

SMTV Desk 2019-03-14 14:22:50  maoist dump, chattishghar, raipur, raj nandugav district, police

రాయిపూర్, మార్చ్ 14: రాజ్ నందుగావ్ జిల్లా గట్ఫార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీలో నక్టిఘటి అడవి ప్రాంతంలో మావోయిస్ట్ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో విప్లవ సాహిత్యం, 14. డిటోనేటర్లు, 1 పిపి బాంబ్, గన్ పౌడర్, జోడి పిత్, రోజూ వారి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంత భారీ మొత్తంలో మావోయిస్ట్ ల డంపు ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టుల డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మావోల కోసం భారీ ఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు కూంబింగ్ తో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.