అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న మంచు తుఫాను

SMTV Desk 2019-03-14 13:45:26  america, snow rain, colorado, People getting off the Detroit plane

కొలరాడో, మార్చ్ 14: అమెరికాలో చలి గాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఈ గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అంతేకాక హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు కూడా రద్దయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుఫానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుఫానును బాంబ్‌ తుఫానుగా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. విమనాల రాకపోకలను నిలిపి వేశారు. దీంతో 1339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నాయి. భవనాలు కూలిపోయాయి.