అల్లూరిగా చరణ్.. కొమరంభీంగా తారక్

SMTV Desk 2019-03-14 13:44:24  Allu arvind, komaram bheem

హైదరాబాద్, మార్చ్ 14: అనుకున్నట్టుగానే అదిరిపోయే న్యూస్ తో వచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇద్దరు రియల్ హీరోస్ కథతో ఆర్.ఆర్.ఆర్ వస్తుందని.. సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. వారు ఫ్రీడం ఫైటర్స్ గా మారకముందు జరిగే కథతో ఆర్.ఆర్.ఆర్ ఉంటుందని చెప్పారు.

అసలు ప్రేక్షకులు తెలియని కథను ఫిక్షన్ గా ఈ సినిమా చెబ్బఓతున్నారట. తనకు వచ్చిన ఈ ఆలోచనని తన తండ్రికి చెబితే కథ సిద్ధం చేశారని.. ఇది పెద్ద బడ్జెట్ మూవీగా.. భారీ స్కేల్ లో ఆర్.ఆర్.ఆర్ వస్తుందని అన్నారు రాజమౌళి. ఇక జూలై 30, 2020లో సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.

సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా.. ఎన్.టి.ఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. అల్లూరి, కొమరం భీం ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ కథ రాసుకునామని.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తారని చెప్పుకొచ్చారు రాజమౌళి.

బాహుబలి కాదు దానికి మించే కథతోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు రియల్ ఫైట్స్ కథతో వస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.