జయరామ్ హత్య కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్

SMTV Desk 2019-03-14 13:13:49  Jayaram Murder case,

హైదరాబాద్ , మార్చ్ 14: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఇప్పటికే ఈ కేసులో రాకేశ్ రెడ్డి, రౌడీ షీటర్ నగేష్, అతని అల్లుడిని అదుపులోకి తీసుకున్న వారు నిన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో టాలీవుడ్ నటుడు సూర్యప్రసాద్ (ఆ నలుగురు ఫేమ్) సహా అంజిరెడ్డి, కిశోర్ అనే వ్యక్తులను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీళ్లని ఈరోజు కోర్టు ముందు హాజరు పరచనున్నారు. జయరామ్ హత్యను అంజిరెడ్డి చూశాడని, ఆయనను చంపేస్తున్నారన్న విషయం సూర్యప్రసాద్, కిశోర్‌లకు ముందుగానే సమాచారం ఉందని వారు ఆయన శవాన్ని చూశాక కూడా పోలీసులకి తెలపలేదనే అభియోగాలతో వారిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇక మరోపక్క మరోవైపు జయరాం మేనకోడలికి సైతం హత్య విషయం తెలుసన్న కోణంలో కూడా ఆమెని మరోసారి ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు తెలంగాణా పోలీసులు. తొలుత ఈ కేసును ఏపీ అధికారులు పెద్దగా దర్యాప్తు చేయకుండానే తేల్చేశారు, దాంతో ఈ కేసుని తెలంగాణా పోలీసులు దర్యాప్తు చేయాలని కోరుతూ హతుడి భార్య తెలంగాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు, 11 రోజలపాటు దాదాపు 80 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయినా ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు.