స్విస్ ఓపెన్ నుంచి సైనా ఔట్!

SMTV Desk 2019-03-14 13:12:51  saina nehwal, switzerland, indian badminton, swis opens, stomach pain

మార్చ్ 14: స్విస్ ఓపెన్ నుంచి బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వైదొలిగారు. గత కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్న సైనా స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు కడుపు నొప్పి తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సైనా పోస్ట్‌ చేశారు.‘ఇది నిజంగానే నాకు చేదు వార్త. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అన్నాశయ సంబంధిత సమస్యగా చెప్పారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా’ అని సైనా అని తెలిపారు.