బోయింగ్ విమాన సేవలు నిషేధం

SMTV Desk 2019-03-14 13:11:31  Boeing MAX 8 aircraft ban, Boeing 737 Max

మార్చ్ 14: ఇండోనేషియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ 737 విమాన ప్రమాదాల ప్రభావం ఆ సంస్థ విమానాలపై గట్టిగా పడింది. ఈ విషయంపై భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల రాకపోకలను రెండు రోజుల పాటు నిషేధించింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. బోయింగ్ విమానాలు వరుసపెట్టి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ విమానాలకు పూర్తిస్థాయిలో మార్పులు చేయడంతోపాటు భద్రతా పరమైన చర్యలు తీసుకున్న తర్వాతే బోయింగ్ విమానాలు మళ్లీ కదులుతాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది.