అక్రమ ఆయుధాల నిరోధనపై పునరుద్దరణ

SMTV Desk 2019-03-14 13:10:06   Vijay Gokhale, india, america, Indian Foreign Secretary Vijay Keshav Gokhale

వాషింగ్టన్, మార్చ్ 14: అమెరికా, భారత్ ల మధ్య గతంలో పలు కారణాల వల్ల నిలిచిపోయిన అక్రమ ఆయుధాల వ్యాప్తిని నిరోధించే అంశం మళ్ళీ పునరుద్దరించబడింది. రెండు దేశాల మధ్య అక్రమ ఆయుధాల వ్యాప్తి నిరోధించే అంశంలో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదిరిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. అమెరికా ప్రతినిధి ఆండ్రియా థాంప్సన్ తో చర్చలు సఫలమయ్యాయన్న విజయ్ గోఖలే..అంతర్జాతీయ రక్షణ అంశాలపైనా చర్చించినట్టు వెల్లడించారు.