మెగాస్టార్ చిరంజీవికి ఊరట

SMTV Desk 2019-03-14 13:09:13  Megastar, Chiranjeevi,

హైదరాబాద్ , మార్చ్ 14: మెగాస్టార్ చిరంజీవి మీద నమోదయిన ఒక కేసు నుండి ఆయనకు ఊరట లబించింది. ఆయన గత ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహిస్తూ, రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం చేశారని ఆయన మీద ఒక కేసు నమోదైంది. గుంటూరు పరిధిలోని అరండల్ పేట పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేస్తూ, చిరంజీవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగాలతో కేసు రిజిస్టర్ చేశారు. అయితే అప్పట్లో ఈ చార్జ్ షీట్ ను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వాదిస్తున్న చిరంజీవి తరపు న్యాయవాది తమ క్లయింట్ ప్రచారం ముగించుకుని వస్తుండగా ఆయన మీద కావాలనే అక్రమంగా కేసు బనాయించారంటూ కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఫిర్యాదు దారుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కేసును రద్దు చేస్తూ తీర్పును ఇచ్చారు.