భారీగా అక్రమ లిక్కర్

SMTV Desk 2019-03-14 13:06:47  liquor, karnataka

బెంగుళూరు, మార్చ్ 14: కర్ణాటకలో భారీగా అక్రమ లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివమొగ్గ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు.. 7 వేల 5 వందల 26 లీటర్ల అక్రమ మద్యంతో పాటు రెండు బైకులను సీజ్ చేశారు. దీని విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బస్వరాజ్ తెలిపారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు.