జనసేన అభ్యర్థి పై టీడీపీ హాట్ కామెంట్స్

SMTV Desk 2019-03-14 12:15:45  jansena,

విజయవాడ, మార్చ్ 14: ఏపీ లో రానున్న ఎన్నికలలో ప్రధాన పోరు కేవలం వైసీపీ- తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉండబోతుందని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు.ఇంకా ఎన్నికలకు కొద్ది రోజులు గడువు మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు వారి పనులను మరింత వేగవంతం చేసారు.ఇప్పటికే కొంత మంది వారి పార్టీ అభ్యర్థులను అధికారికంగా మరియు అనధికారికంగా ప్రకటించేసారు.అయితే జనసేన పార్టీ నుంచి ఎలాంటి అభ్యర్థులను పవన్ నిలబెడతారో అన్న ఆతురుత ప్రతీ ఒక్కరిలోనూ నెలకొనే సందర్భంలోనే పవన్ ఎవరు ఊహించని విధంగా తన పార్టీ మొట్ట మొదటి అభ్యర్థిగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణను పోటీగా నిలబెట్టారు.

జనసేన పార్టీ మొట్టమొదటి అభ్యర్థి ఆయన కావడంతో రాజకీయ శ్రేణుల్లో కూడా ఆయన మంచి హాట్ టాపిక్ గా నిలిచారు.ఇప్పుడు రాజకీయాల్లో పెను మార్పులు జనసేన వలన తప్పవు అని ఒక పక్క రాజకీయ విశ్లేషకులు చెప్తుండగా జనసేన పార్టీ మొదటి అభ్యర్థి అయిన పితాని బాలకృష్ణ అసలు తమకి పోటీయే కాదని ముమ్మిడివరం టీడీపీ నేత దత్ల సుబ్బరాజు అంటున్నారు.ఇక్కడ కేవలం మాకు వైసీపీ ల మధ్యే పోటీ ఉంటుందని జనసేన ప్రభావం ఏమి ఉండదని తేల్చి చెప్పేస్తున్నారు.మరి రానున్న రోజుల్లో జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూసి తీరాల్సిందే.