మెదీ వెబ్‌సీరీస్‌ వచ్చేస్తుంది ...

SMTV Desk 2019-03-14 12:14:52  Modi, Modi web series

ముంబై, మార్చ్ 14: :భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్‌సీరీస్‌ను ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో చిత్ర యూనిట్ తెలిపారు. పది భాగాలుగా తీసిన ఈ సీరీస్‌ పేరును ఖమోదీగ అని ఖరారు చేసారు . ఈ వెబ్‌సీరీస్‌లో నరేంద్రమోదీ బాల్యానికి సంబంధించిన విశేషాలతో పాటు ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేంత వరకు అంచలంచెలుగా ఎదిగిన తీరును చిత్రీకరించినట్లు తెలిపారు. సిద్ధ్‌పూర్, వాద్‌నగర్, గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సీరీస్‌ను తీశామని వివరించారు. దీనికి సంబంధించిన మొదటి పోస్టర్‌ను సామాజిక మాద్యమంలో విడుదల చేసినట్లు నిర్మాతలు తెలిపారు. మోదీ వెబ్ సీరీస్‌కు ఓ మై గాడ్ ఫెమ్ ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించగా… మిహిర్ భుట్ట, రాధికా ఆనంద్ రచించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే నెలలోనే ప్రారంభమవుతుండటం విశేషం.