ప్రముఖ అభ్యర్థిని బరిలోకి దింపనున్న బీజేపీ .. చంద్రబాబు కి సవాల్

SMTV Desk 2019-03-14 12:13:57  Chandra Babu, AP CM , Nadendla bhasker

అమరావతి, మార్చ్ 14: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రముఖ పార్టీలన్నీ వ్యూహరచనలో తలమునకలై ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడతలోనే ఎన్నికలు జరగనుండటంతో ఏపీ, తెలంగాణాలో ఎన్నికల జోరు ముమ్మరం అయ్యింది. ఈ క్రమంలో ఎన్నికల్లో సీటే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు, అధికార ప్రతిపక్షాలు కూడా ప్రత్యర్థులపై పై చేయి సాదించేందుకుప్లాన్ సిద్ధం చేస్తున్నాయి. అధికార టీడీపీ ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీతో సహా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా టీడీపీని గద్దె దించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ఒకింత బలంగా లేనప్పటికీ టీడీపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెగ ప్రయత్నిస్తోంది, ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత నాదెండ్ల భాస్కర్ రావును రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో నాదెండ్ల భాస్కర్ రావును విలన్ గా చూపించారు, దీనిపై చంద్రబాబు అండ్ కో మీద ఆగ్రహం వ్యక్తం చేసారు నాదెండ్ల. ఈ విషయాన్ని అదునుగా తీసుకున్న బీజేపీ చంద్రబాబుకు వ్యతిరేకంగా నాదెండ్లను ప్రచారంలోకి దింపాలని భావిస్తోందట, ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ నాదెండ్లను ఇంటికెళ్లి కలిసారట. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై, కేంద్రంలో మోడీ ప్రభుత్వ పనితీరు గురించి సుదీర్ఘంగా చర్చించారట. బీజేపీ ఆహ్వానాన్ని పూర్తిగా అంగీకరించకపోయినప్పటికీ అలోచించి నిర్ణయం తెలియజేస్తానని అన్నారట నాదెండ్ల. మరీ, బీజేపీ ఆహ్వానంపై నాదెండ్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.