లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అవుతుందా..?

SMTV Desk 2019-03-14 09:41:52  ntr, rgv,

హైదరాబాద్, మార్చ్ 14: ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో వస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మార్చి 22న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ ను ఆపేయాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశాడు తెలుగుదేశం పార్టీ అభిమాని దేవిబాబు చౌదరి. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు విలన్ గా చూపించడంపై టిడిపి శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్స్ సంచలనంగా మారాయి.

ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న రాం గోపాల్ వర్మ ఈ సినిమా రిలీజ్ కాకుండా ఎవరు ఆపలేరని అంటున్నాడు. తనని చంపేసినా సరే యూట్యూబ్ లో అయినా సరే ఆ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే ఈ సినిమా అడ్డుకునేందుకు టిడిపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏపి ఎలక్షన్స్ కు నెల రోజులు మాత్రమే ఉన్న ఈ టైంలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అయితే చంద్రబాబు మీద వ్యతిరేకత వస్తుందని సినిమాను ఎలాగైనా అడ్డుకునేలా చూస్తున్నారు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై ఎలక్షన్ కమీషన్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.