మహర్షి అప్ డేట్ : ఓవర్సీస్ లో 18 కోట్లు

SMTV Desk 2019-03-14 09:39:58  Maharshi,

హైదరాబాద్, మార్చ్ 14: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న మహర్షి సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు. రిలీజ్ కు ఇంకా రెండు నెలలు టైం ఉన్నా సినిమా రైట్స్ విషయంలో ఇప్పటికే హంగామా మొదలైంది. ఓవర్సీస్ లో మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. అందుకే మహర్షి సినిమాను అక్కడ 18 కోట్లు చెబుతున్నారట. అయితే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 13 కోట్ల వరకు పెడతామని వచ్చారట.

ఈమధ్య తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో పెద్దగా లాభాలు పొందట్లేదు. అందుకే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కొంత కంగారు పడుతున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారట. సినిమా గురించి దిల్ రాజు 2, 3 సార్లు అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందని అన్నారు. మరి మహర్షి ఓవర్సీస్ డీల్ ఎంతకు సెట్ అవుతుందో చూడాలి. అంచనాలను అందుకుంటే మరోసారి మహేష్ తన స్టామినా చూపించేలా వసూళ్లు రాబడతాడని చెప్పొచ్చు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.