హిట్ మాన్ మరో ఘనత

SMTV Desk 2019-03-14 09:34:28  rohit sharma, odi, 8000 runs in ODI cricket

న్యూఢిల్లీ, మార్చ్ 13: టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు. ఆసిస్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఆఖరి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ వన్డే క్రికెట్ లో వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న జాబితాలోకెక్కాడు. కాగా ఈ మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. ఇక క్రీజులోకేల్లిన టీం ఇండియా ప్రస్తుతానికి నిలకడగానే ఆడుతోంది. టీం ఇండియా స్కోర్ : 129/4.