జనసేన పొత్తు పై బాబు స్పందన

SMTV Desk 2019-03-14 09:29:20   Janasena, tdp,

హైదరాబాద్, మార్చ్ 13: ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఏపీలో రాజకీయ పార్టీల్లో హడావిడి మెుదలైంది. అయితే పొత్తులపై ఆయా పార్టీలు క్లారిటీ ఇస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . ఇది ఇలా ఉండగా తాము వామపక్ష పార్టీలతోనే తప్ప ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే గత కొంతకాలంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు జనసేన పార్టీపై కానీ, పవన్ కళ్యాణ్ పై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యకపోవడంతో రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతు వస్తుంది. ఈ నేపథ్యం లో చంద్రబాబు తేరా దించారు ... జనసేనతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.