ఐసిసి వరల్డ్‌కప్‌కు అధికారిక స్పాన్సర్‌గా గోడాడీ

SMTV Desk 2019-03-14 09:24:31  icc world cup 2019, go daddy, sponsored

న్యూఢిల్లీ, మార్చ్ 13: వన్డే ప్రపంచ కప్ కు ఈ సారి గోడాడీ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందం విలువ 3 మిలియన్‌ డాలర్లు. ఈ స్పాన్సర్‌ షిప్‌ ద్వారా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో ప్రవేశద్వారాలు, సైడ్‌ స్క్రీన్లు, బ్యాక్‌ డ్రాప్స్‌పై గోడాడీకి ప్రచారం చేసుకోనుంది. ఈ సందర్భంగా గోడాడీ ఇండియా విభాగం ఎండీ, ఉపాధ్యక్షుడు నిఖిల్‌ అరోరా మాట్లాడుతూ... "వరల్డ్‌కప్ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచలోని దాదాపు మూడింట రెండోంతుల మంది ఈ మెగా ఈవెంట్‌ని వీక్షిస్తారు. ముఖ్యంగా భారతీయులు దీనిని కచ్చితంగా చూస్తారు. మేము ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం" అని అన్నారు. ఇదిలా ఉంటే, షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.