గత మూడు రోజుల నుండి లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

SMTV Desk 2019-03-14 09:21:57  Sensex, Nifty, Stock market, Share markets

న్యూఢిల్లీ, మార్చ్ 13: ఈ రోజు కూడా దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో తేలుతున్నాయి. గత మూడు రోజుల నుండి స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడం విశేషం. సెన్సెక్స్ 216 పాయింట్లు పెరిగి 37752 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 11342 వద్ద ముగిశాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, రిలయన్స్ తదితర షేర్లు లాభపడగా.. భారతీ ఎయిర్ టెల్, వేదాంత, ఐఓసి, సన్ ఫార్మా, టాటా స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.