నాచురల్ స్టార్ నాని భారీ బడ్జెట్ మూవీ..!

SMTV Desk 2019-03-14 09:18:18  Natural Star nani,

హైదరాబాద్, మార్చ్ 13: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నాచురల్ స్టార్ గా ఎదిగిన నాని మినిమం గ్యారెంటీ హీరో అయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా ఆరు సినిమాలు సూపర్ హిట్ అవగా నాని క్రేజ్ డబుల్ అయ్యింది. అయితే లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు సినిమాలు పెద్దగా మెప్పించలేదు. అందుకే నాని కథల విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రస్తుతం నాని జెర్సీ సినిమాతో రాబోతున్నాడు.

ఆ సినిమా తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మాత్రం నాని భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ సినిమా చేస్తుందని తెలుస్తుంది. స్టార్ డైరక్టర్ ఈ చిత్రాన్ని చేయాలని చూస్తున్నారట. అయితే ఆ దర్శకుడు ఎవరు.. నిర్మాణ సంస్థ ఏది అన్నది మాత్రం మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. నాని ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడని ఫిల్మ్ నగర్ టాక్.