కె.జి.ఎఫ్-2 మొదలుపెట్టారు

SMTV Desk 2019-03-14 09:17:19  KGF, kgf 2

హైదరాబాద్, మార్చ్ 13: కన్నడ సినిమా కె.జి.ఎఫ్ సంచలన విజయం అందుకుంది. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచినా తెలుగు, తమిళ, హింది భాషల్లో అంచనాలకు మించి సినిమా హిట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన కె.జి.ఎఫ్ సినిమాలో యశ్, శ్రీనిధి శెట్టి నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో సాగిన ఈ కథను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. ఇదిలాఉంటే ఈ సినిమా చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో చాప్టర్ 2కి సిద్ధం చేస్తున్నారు.

బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ మొదలైంది. చాప్టర్ 1, 50 కోట్లతో నిర్మించగా పార్ట్ 2ని 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సీక్వల్ లో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తారని అంటున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి కె.జి.ఎఫ్ చాప్టర్ 1 రికార్డులను తిరగరాసేలా ఈ సినిమా కూడా ఉంటుందో లేదో చూడాలి.