హైదరాబాద్ లో రూ.కోటి విలువ గల డ్రగ్స్ పట్టివేత

SMTV Desk 2019-03-14 09:16:26  drugs, hyderabad, neredmet, rachakonda police

హైదరాబాద్‌, మార్చ్ 13: హైదరాబాద్ నగరంలో ఈ రోజు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు నేరెడ్‌మెట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుందడగా అక్రమంగా డ్రగ్స్ ను రవాణా చేస్తున్న ఓ గ్యాంగ్ పట్టుబడింది. రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుండి భారీ మొత్తంలో కొకైన్‌, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏపి,తెలంగాణలో గత కొంతకాలంగా ఈ ముఠా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి కొకైన్‌, హెరాయిన్‌ను వీరు విక్రయిస్తున్నారు. అరెస్టైన నలుగురూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.