స్పైస్ జెట్ కు భారీ షాక్!

SMTV Desk 2019-03-14 09:12:38  SpiceJet Grounds Boeing 737 MAX, Ethiopia Plane Crash, DGCA no go to Boeing 737-Max planes, SpiceJet cancels 14 flights

మార్చ్ 13: ఇండోనేషియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ 737 విమాన ప్రమాదాలతో భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తమైంది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. ఐదు నెలల వ్యవధిలో బోయింగ్ 737 రకం విమానాలు రెండు ప్రమాదానికి గురికావడంతో వీటి ప్రతికూల ప్రభావం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పై పడింది. స్పైస్ జెట్ షేరు బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంట్రాడేలో దాదాపు 8 శాతం మేర పతనమై 72.50 స్థాయికి క్షీణించింది. బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ నిషేధం వల్ల స్పైస్ జెట్ ఆదాయం, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను విక్రయించేందుకు రెడీ అయ్యాయి. దీంతో స్పైస్ జెట్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్ కూడా నష్టాల్లోనే కదలాడుతోంది.