స్టేడియంలో కంటతడి పెట్టుకున్న రొనాల్డొ గర్ల్‌ఫ్రెండ్

SMTV Desk 2019-03-14 09:07:37  Georgina Rodriguez, Georgiana Rodriguez Cry after Ronaldo Hattrick , Juventus vs Atletico, Ronaldo

మార్చ్ 13: మంగళవారం జ్యూవెంటస్, అట్లెటికొ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో జ్యూవెంటస్ జట్టు 3 గోల్స్ చేసి అట్లెటికొ మాడ్రిడ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానొ రొనాల్డొ జట్టును భారీ ఆధిక్యంతో గెలిపించాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అతని గర్ల్ ఫ్రెండ్ జార్జినా రొడ్రిగేజ్‌కు ఆనందంతో మైదానంలోనే భావోద్వేగానికి గురైంది. కన్నీటితో తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఆ సన్నివేశాన్ని తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో పోస్టు చేసి ఇలా కామెంట్ చేసింది. 3-0స్కోరును ఎవ్వరూ చెరపలేరు. ఇది నీ అంకితభావానికి నిదర్శనం. జట్టు కోసం పడిన కష్టం వృథాగా పోదు. జట్టు సహచరులకు నువ్వొక ట్రైలర్ లాంటి వాడివి. కోచ్‌తో పాటు ఈ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. దేవుడికి తెలుసు నీకేం ఇవ్వాలో. ప్రపంచ ఫుట్‌బాల్ నీదే. క్రిస్టియానిటో, మాటో, అలానా, జార్జినా మీరంటే మాకెంతో ఇష్టం అని భావోద్వేగపూరితంగా కామెంట్ చేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రొనాల్డొ.. ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. అంటే గోల్స్ గురించి కాదు. జట్టు బాగా సహకరించింది. మానసికంగా మేము చాంపియన్స్. జ్యూవెంటస్ నన్ను కొనుగోలు చేసిందానికి అర్థం ఇదే అని తెలిపాడు.