పాక్ బాలుర పట్ల సుహృద్భావం ప్రదర్శించిన భారత్

SMTV Desk 2017-06-01 18:26:36  srinagar, pak boys, indian army, indian army save boys

శ్రీనగర్, జూన్ 1: రోజురోజుకు నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సందర్భంలో భారత్ సుహృద్భావం ప్రదర్శించింది. దారితప్పి పాక్ అక్రమిత కశ్మీర్ నుండి పోరపాటున భారత భూభాగంలోకి వచ్చేసిన ఇద్దరు బాలురను భారత సైన్యం సురక్షితంగా వెనక్కి తిప్పిపంపింది. సరిహద్దులు దాటి వచ్చారని అమాయకులను పాక్ కఠినంగా వ్యవహరించి..వారి ప్రాణాలనే కబళించిన సరబ్ జీత్, తాజాగా కులభూషణ వంటి ఘటనలు ఆందోళన కలిగించేవైనప్పటికి భారత సైన్యం సామరస్యంగా వ్యవహరించింది. పాక్ అక్రమిత కశ్మీర్ నుండి వసలత్ ఖాన్ (13), మహమ్మద్ ఇఫ్తికర్ ఖాన్ (12) ఇద్దరూ మే 23న దారితప్పిపోయి టంగ్ధార్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి ప్రవేశించారు. అయితే వ్యూహాత్మకం, ప్రమాదకరమైన ప్రాంతంగా భావించే సరిహద్దు నుండి వారిద్దరికీ ఎలాంటి హానీ జరగకుండా భారత సైన్యం ఇవతలకు తీసుకవచ్చింది. పాక్ అక్రమిత కాశ్మీర్ లోని సిమరి గ్రామానికి చెందిన వారిద్దరిని పాక్ కు తిరిగి అప్పగించారు.