సహాయం పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడట

SMTV Desk 2019-03-14 09:06:43  vijayalakshmi,

హైదరాబాద్ , మార్చ్ 13: ఒకప్పటి హనుమాన్ జంక్షన్ చిత్రంలో అర్జున్ – జగపతిబాబు ల చెల్లిగా నటించిన విజయలక్ష్మి తెలుగు ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది. కన్నడ హీరోయిన్ అయిన విజయలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఆమె ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి తమ కన్నడ సీమలో ఎవరైనా సహాయం చేస్తారేమో అని సహాయాన్ని అర్ధించింది. దాంతో పలువురు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. అందులో కన్నడ నటుడు రవిప్రకాష్ ఉన్నాడు. అయితే విజయలక్ష్మి ఆసుపత్రి నుండి బయటకు రాకముందే ఆమెని మానసికంగా లైంగికంగా వేదించడం మొదలు పెట్టాడట రవిప్రకాష్. తను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఫిబ్రవరి 27వ తేదీన నటుడు రవి ప్రకాష్ ఆస్పత్రికి వచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసారనీ అనంతరం ప్రతి రోజూ ఐసీయూకు వస్తూండటం, పదే పదే ఫోన్‌ మెసేజ్‌లు చేయడం వంటివి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారనీ చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. కాగా నటుడు రవి ప్రకాష్ ఆవిడ చేసిన ఆరోపణలను ఖండించారు.ఆమెపై కర్ణాటక వాణిజ్య మండలిలో రవి ప్రకాశ్‌ ఫిర్యాదు చేశారు. కష్టాల్లో ఉన్న ఆమెకు తాను మీడియాలో చూసి నగదు సాయం చేశారని తెలిపారు. అంతేకానీ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం కష్ట సమయంలో సహాయం చేయాలని కోరితే డబ్బులను ఇచ్చినట్లు తెలిపారు. ఆమెతో తను మాట్లాడిన కాల్‌ రికార్డ్‌ ఉందని పేర్కొన్న ఆయన కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయటమే తన తప్పని ఆమె క్షమాపణ చెప్పాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు.