మోదీ నుండి చాల నేర్చుకున్న ..

SMTV Desk 2019-03-14 09:03:14  Modi, Rahul Gandhi,

న్యూ ఢిల్లీ,, మార్చ్ 13: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ఎప్పుడు కోపంగా ఉండాలో, ఉండకూడదో ఆయన్ను చూసి తెలుసుకున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తమిళనాడుకు వచ్చిన ఆయన, ప్రముఖ స్టెల్లామేరీ కాలేజీ విద్యార్థినులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, 2014లో తాను యువకుడిగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు కూడా యువకుడినేనని చెప్పిన ఆయన, ఐదేళ్ల నాడు మోదీని చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ఆయన నాపై ఎంతో కోపంతో విమర్శలు చేసేవారని, దాన్నుంచి తాను కోప్పడకుండా వాటిని తిప్పికొట్టడం ఎలానో తెలుసుకున్నానని అన్నారు. మనకు ఏవైనా విషయాలను నేర్పించే వారిపై కోపం ఉండదని, మోదీపైనా తనకు కోపం లేదని అన్నారు.