పాక్ గూఢచారి అరెస్ట్

SMTV Desk 2019-03-14 09:02:12  pakistan, india, indian army, pakistan army, indian army secrets shares to pakistan in whatsapp , coding

జైపూర్‌, మార్చ్ 13: భారత ఆర్మీ రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న ఓ గూఢచారిని భారత అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం...జైసల్మేర్‌ జిల్లాకు చెందిన నవాబ్‌ ఖాన్‌ గూఢచార కార్యకలాపాలను పాల్పడుతున్నట్లు అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడిపై నిఘా వేయగా, తమ అనుమానాలు నిజమయ్యాయని వెంటనే అతడిని అరెస్టు చేసినట్లు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంటిలిజెన్స్‌ ఉమేశ్‌ మిశ్రా తెలిపారు. ఇండియన్‌ ఆర్మీ సమాచారాన్ని తస్కరిస్తూ ఓ కోడ్‌ భాషలో వాట్సప్‌ ద్వారా చేరవేస్తున్నట్లు మిశ్రా పేర్కోన్నారు. గత సంవత్సరంలో ఖాన్‌ పాక్‌ను సందర్శించాడని, ఆ సమయం నుంచే ఐఎస్‌ఐతో టచ్‌లో ఉన్నాడని అన్నారు. ఖాన్‌కు గూఢచారానికి సంబంధించిన కోచింగ్‌ ఇచ్చి, భారత ఆర్మీ రహస్యాలను చేరవేసే బాధ్యత అప్పగించిందని మిశ్రా తెలిపారు.