చిత్రలహరి టీజర్ టాక్

SMTV Desk 2019-03-13 15:38:25  Chitralahari teaser,

హైదరాబాద్, మార్చ్ 13: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం చిత్రలహరి… ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎమోషనల్ ప్రేమ కథ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.



ఈ సినిమాలో తేజూ సరికొత్త లుక్ లో కనిపించడమే కాదు అయన క్యారెక్టర్ కూడా చాల కొత్తగా ఉంది. ఇక సునిల్ తన కామెడీ టైమింగ్ తో యూ టర్న్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం సునీల్ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించనున్నాడని అర్థమవుతుంది. దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్‌ అందరి పాత్రలను పరిచయం చేస్తుంది. ఈ సినిమాలో తేజూ పాత్ర పేరు విజయ్. తన పేరులో ఉన్న విజయం తన జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడని తెలుస్తుంది.

చిత్రలహరి టీజర్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. దేవి – కిషోర్ కాంబో లో వచ్చిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరీ ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఇక…