పాక్ లో అభినందన్ అభిమానులు

SMTV Desk 2019-03-13 15:26:03  indian wing commander abhinandan vardhaman, indian airforce, pakistan forest department

ఇస్లామాబాద్, మార్చ్ 13: ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు భారత్ లోనే కాదు...పాక్ లోనూ అభిమానులున్నారు. తాజాగా పాకిస్తాన్‌లోని ఓ టీ స్టాల్ ముందు మన రియల్ హీరో అయిన అభినంధన్ చిత్రంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. అభినంధన్‌ను స్నేహ దూతగా అభివర్ణిస్తూ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆ ఫ్లెక్సీలో అభినంధన్ చిత్రం పక్కన ఓ వాక్యాన్ని రాశారు. ‘‘ఇలాంటి చాయి ప్రత్యర్థులను కూడా స్నేహితులను చేస్తుంది’’ అని రాసుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. యుద్ధాన్ని కాదు.. చాయ్ తయారు చేద్దాం. ప్రపంచ చాయ్ ప్రేమికులారా ఏకంకండి… శాంతిని ప్రభోదిద్దాం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.