యువ సైక్లిస్ట్ కెల్లీ కాట్లిన్ ఆత్మహత్య!

SMTV Desk 2019-03-13 15:22:24  Kelly Catlin, Cycling World Championship, US , Kelly Catlin dead

అమెరికా, మార్చ్ 13: అమెరికాకు చెందిన యువ సైక్లిస్ట్ కెల్లీ కాట్లిన్ (23) ఆత్మహత్య చేసుకొంది. ఈమె రియో ఒలింపిక్‌ పతక విజేత, మూడు సార్లు సైక్లింగ్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచారు. 2016-18 మధ్య కాలంలో మూడుసార్లు వరల్డ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్ నెగ్గిన అమెరికా జట్టులో కెల్లీ సభ్యురాలుగా ఉన్నారు. కెల్లీ మృతికి కారణాలు బయటికి తెలియలేదు గానీ ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు ఈ-మెయిల్‌లో తండ్రి మార్క్‌కి ఫేస్‌బుక్‌ ద్వారా సోదరుడు కాలిన్‌కు సూసైడ్‌ నోట్‌ పంపించిందని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఆమె తలకు తగిలిన గాయంతో తలనొప్పితో బాధపడుతుంది. దీనికి తోడు విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉన్న కెల్లీ జనవరిలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె సోదరి తెలిపింది.