ఎలక్షన్ కోడ్ స్టార్ట్ : రాజస్ధాన్‌లో భారీగా మద్యం పట్టివేత

SMTV Desk 2019-03-13 15:20:07  loksabha elections, parliament, election commission of india, election code, rajasthan, dousa, baswa police

జైపూర్, మార్చ్ 13: త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తతెలిసిందే. అయితే ఎన్నికల కారణంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు తీవ్ర పట్లు పడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే రాజస్ధాన్‌లోని దౌసాకు సమీపంలోని బస్వాలో పోలీసులు బుధవారం వాహనాలను తనిఖీ చేశారు. ఓ ట్రక్కులో తరలిస్తున్న 239 కార్టన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. హర్యానా నుంచి దౌసాకు వెళుతున్న ట్రక్కులో భారీగా మద్యం పట్టుబడడం కలకలం రేపింది. ఎన్నికల సందర్భంగా ఈ మద్యాన్ని తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.