నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2019-03-13 14:05:37  నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చ్ 13: పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కాస్త నిలకడగా ఉన్నాయి. నేడు కూడా మంగళవారం నాటి ధరలే కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.41 వద్ద కొనసాగుతోంది. డీజిల్aca ధర రూ.67.37 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 78 మార్క్ పైనే కొనసాగుతోంది. రూ.78.04 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.70.58 వద్ద ఉంది. ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 77 మార్క్‌‌కు సమీపంలో కదలాడుతోంది. రూ.76.84 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.73.25 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.76.57 వద్ద, డీజిల్‌ ధర రూ.72.58 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.20 వద్ద, డీజిల్ ధర రూ.72.24 వద్ద కొనసాగుతోంది.