తత్కాల్ టికెట్ బుకింగ్స్ వివరాలు

SMTV Desk 2019-03-13 14:02:52  IRCTC Tatkal Booking, Quick Book Railway Tatkal Ticket Online, IRCTC

మార్చ్ 13: ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా లేదా రైల్వే కౌంటర్‌కు వెళ్లి తత్కాల్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఐఆర్‌సీటీసీ ప్రకారం.. ట్రైన్ బయలుదేరే తేదీకి ఒక రోజు ముందు మాత్రమే తత్కాల్ టికెట్లను బుకింగ్ చేసుకోగలం. కాగా ఏసీ తరగతులకు (2ఏ, 3ఏ, సీసీ, 3ఈ) తత్కాల్ విండో ఉదయం 10 గంటలకు ప్రారంభమౌతుంది. అదే నాన్ ఏసీ తరగతులకు (ఎస్‌ఎల్, ఎఫ్‌సీ, 2ఎస్) తత్కాల్ విండో ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది.

**ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్స్ చార్జీలు:

సెకండ్ క్లాస్ -(సీటింగ్) కనిష్ట తత్కాల్ చార్జీరూ.10...గరిష్ట తత్కాల్ చార్జీ రూ.15
స్లీపర్ కనిష్ట -తత్కాల్ చార్జీరూ.90...గరిష్ట తత్కాల్ చార్జీ రూ.175
ఏసీ చైర్ కార్ -కనిష్ట తత్కాల్ చార్జీ రూ.100...గరిష్ట తత్కాల్ చార్జీ రూ.200
ఏసీ 3 టైర్ -కనిష్ట తత్కాల్ చార్జీ రూ.250...గరిష్ట తత్కాల్ చార్జీ రూ.350
ఏసీ 2 టైర్ -కనిష్ట తత్కాల్ చార్జీ రూ.300...గరిష్ట తత్కాల్ చార్జీ రూ.400
ఎగ్జిక్యూటివ్ -కనిష్ట తత్కాల్ చార్జీ రూ.300...గరిష్ట తత్కాల్ చార్జీ రూ.400

బుకింగ్ నిబంధనలు :

✺ రైల్వే కౌంటర్‌కు వెళ్లి తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
✺ తత్కాల్ టికెట్లలో ఒక పీఎన్ఆర్‌పై గరిష్టంగా నాలుగురు ప్యాసింజర్లు మాత్రమే రిజర్వేషన్ చేసుకోగలరు.
✺ స్లీపర్ క్లాస్ టికెట్లపై కనీసం రూ.100, గరిష్టంగా రూ.200 చార్జ్ చేస్తుంది. ఏసీ చైర్ కార్ టికెట్‌పై రూ.125 నుంచి రూ.225 శ్రేణిలో చార్జీ వసూలు చేస్తుంది.
✺ తత్కాల్ బుకింగ్స్‌కు సంబంధించి ఎలాంటి రాయితీలు ఉండవు.
✺ కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ రాదు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే కొంత చార్జీని వసూలు చేస్తారు.