‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎన్నికలపై ప్రభావం చూపుతుందా?

SMTV Desk 2019-03-13 13:33:39  Varma, Lakshmis, NTR

హైదరాబాద్, మార్చ్ 13: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుండి రామ్ గోపాల్ వర్మ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వివాదాలతోనే సినిమాకి కావాల్సినంత ఇమేజ్‌ను తెచ్చాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుండటంతో రాబోయే ఎన్నికల్ని కూడా ప్రచారానికి వాడేస్తున్నాడు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల బంధం ఆధారంగా తీసిన ఈ సినిమా రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటూ ట్విట్టర్లో పోల్ పెట్టాడు వర్మ. రెండు గంటల్లోనే దానికి 11 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. చిత్రం ఏమిటంటే 70 శాతం మంది నెటిజన్లు సినిమా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఓట్ చేయడం గమనార్హం.