ఆవు మాంసం తిని గోలగోల చేసిన ఎన్నారై!

SMTV Desk 2019-03-13 13:02:46  nri, newzeland, beef, mutton, super market, countdown, eat beef

న్యూజిలాండ్‌, మార్చ్ 13: న్యూజిలాండ్‌లోని కౌంట్‌డౌన్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ ఎన్నారై గొర్రె మాంసం అనుకొని ఆవు మాంసం తిని మైల పడ్డానని, శుద్ధి చేసుకోడానికి భారత్‌కు వెళ్లేందుకు డబ్బులివ్వాలని ఆ కంపెనీని డిమాండ్ చేస్తున్నాడు. పూర్తి వివరాల ప్రకారం...జస్వీందర్ పాల్ అనే ప్రవాస భారతీయుడు గతేడా సెప్టెంబరులో ఓ సూపర్ మార్కెట్‌లో మాంసం ప్యాకెట్ కొన్నాడు. దానిపై గొర్రె మాంసం అని రాసి ఉన్నా, లోపల మాత్రం బీఫ్ కుక్కారు. జస్వీందర్ ఇంటికి తీసుకెళ్లి, వండుకుని తినేటప్పుడు అసలు విషయం తెలిసింది. తాను తినింది ఆవు మాంసమని నిర్ధారించుకుని సూపర్‌మార్కెట్ యాజమాన్యం వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఆరా తీసిన యాజమాన్యం, పొరపాటుకు చింతిస్తున్నామంటూ 200 డాలర్ల గిఫ్ట్ ఓచర్‌ను ఇస్తామంది. అవి వద్దని, తనను కంపెనీ ఖర్చులపై భారత దేశానికి పంపాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. ఆవు మాంసం తిన్నందుకు కుటుంబ సభ్యులు తనతో మాట్లాడ్డం లేదని, తీవ్ర నసిక వేదన అనుభవిస్తున్నానని వాపోయాడు. ప్రక్షాళన జరగాలంటే తాను తాను ఆరు వారాలు భారత్‌లో పూజలు చేయాల్సి ఉందని, ఆ ఖర్చలన్నీ ఎవరు ఇస్తారని అడుగుతున్నాడు.