సాయిధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’...వెరైటీ టీజర్

SMTV Desk 2019-03-13 12:59:31  chitralahari movie, sai dharam tej, mytri movie makers, kalyani priyadarshi, nivetha pethuraj

హైదరాబాద్, మార్చ్ 13: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించి అందులో భాగంగా ఈ రోజు ఉదయం టీజర్ ని విడుదల చేసారు. కాగా ఈ టీజర్ కాస్త వెరైటీగా కనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమాతో తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు.