మహేశ్‌తో బాలీవుడ్‌ బ్యూటీ!

SMTV Desk 2019-03-13 12:54:02  Mahesh babu,

హైదరాబాద్, మార్చ్ 13: టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు త్వరలో యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేశ్‌ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే ఆలోచన ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది తారల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

ముందుగా మహేశ్‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తరువాత రష్మిక పేరు తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. మహేష్‌ సరసన హీరోయిన్‌గా సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి. గతంలో క్రిష్ దర్శకత్వంలో మహేశ్‌, సోనాక్షిలు హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందనుందటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరి అనిల్‌ సినిమాతో అయిన ఈ జంట అభిమానులను అలరిస్తుందేమో చూడాలి.