వాయిదా పడనున్న మజిలీ?

SMTV Desk 2019-03-13 12:41:42  majili,

హైదరాబాద్ , మార్చ్ 13: నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్నా మజిలీ సినిమాపై మంచి అంచనాలున్నాయి, పెళ్ళైన తర్వాత చైతూ, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా కావటం, ఇటీవల విడుదలైన టీజర్, లిరికల్ వీడియోలకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాకు పాజిటివ్ బజ్ కూడా వస్తోంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అటు అక్కినేని అభిమానులు, ఇటు చై – సామ్ ల జంట ఎన్ని ఆశలు పెట్టుకుంది, ఈ క్రమంలో సినిమా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఇటీవల వెలువడిన ఎన్నికల షెడ్యూల్ అని తెలుస్తోంది.

నిజానికి మజిలీ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది, తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనుండటంతో సినిమాలకు వర్కౌట్ అవుతుందన్న సెలవుల సీజన్ కాస్తా ఎన్నికల హడావుడికి అంకితం కానుంది, ఈ కారణం చేతనే నాని జెర్సీ సినిమా ఏప్రిల్ 19కి వాయిదా పడింది. ఈ క్రమంలో మజిలీ యూనిట్ కూడా సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది