కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్

SMTV Desk 2019-03-13 12:35:44  Vishweswr reddy ,arrest

హైదరాబాద్, మార్చ్ 12:చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని వికారాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వివక్ష చూపుతోందని, నీళ్ళు, నిధులు, నియామకాలలో జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈరోజు ఉదయం వికారాబాద్ పట్టణంలోపంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్షకు కూర్చోన్నారు. అయితే కొద్దిసేపటికే పోలీసులు అక్కడకు చేరుకొని ఆయనను అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత నాలుగేళ్ళుగా తెరాసలోనే ఉన్నారు. నేటికీ తెరాస ఎంపీగానే ఉన్నారు. నాలుగేళ్ళలో ఆయన ఇటువంటి ప్రయత్నం చేసి ఉండి ఉంటే ప్రజలకు ఆయన చిత్తశుద్దిపట్ల నమ్మకం కలిగి ఉండేది. కానీ తెరాసలో నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసుకొన్న తరువాత హటాత్తుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిపోయిందటూ దీక్షకు కూర్చోవడం ‘ఎలెక్షన్ స్టంట్’ గానే కనిపిస్తుంది.