ఐ లవ్ యు అంటున్న కన్నడ స్టార్ ఉపేంద్ర

SMTV Desk 2019-03-13 12:32:20  I love you teaser, Upendra,

హైదరాబాద్, మార్చ్ 12: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. ఏ, రా, ఉపేంద్రా వంటి సినిమాలతో ఉపేంద్ర తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యారు. కొన్నాళ్లు కన్నడ పరిశ్రమకే పరిమితమైన ఉపేంద్ర లేటెస్ట్ గా ఐలవ్యూ సినిమాతో వస్తున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన ఉపేంద్ర ఆ తర్వాత ఐలవ్యూ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు.




ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఉపేంద్ర సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో అన్ని ఉన్నాయి.. ఉపేంద్ర మార్క్ కనిపించేలా ఐలవ్యూ టీజర్ ఉంది. ఆర్. చంద్రు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రచిత రాం హీరోయిన్ గా నటించారు. టీజర్ అంత గొప్పగా ఏమి లేదు కాని ఉపేంద్ర మార్క్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.