పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019 కాంటెస్ట్... 14 కోట్లు ప్రైజ్ మనీ

SMTV Desk 2019-03-12 16:53:25  PUBG Mobile Club Open 2019, PUBG

మార్చ్ 12: ఆన్ లైన్ వీడియో గేమ్ లలో సంచలనం సృష్టించిన పబ్ జి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తుంది. పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ఏడాది పాల్గొనాలి. గెలిచినవారికి 2 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.14కోట్లు దక్కనున్నాయి.ఈ ఈవెంట్ ఏడాది పాటు జరుగుతుంది. ఇది ఆన్‌లైన్ రంగంలో అతిపెద్ద ఈవెంట్‌గా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనదలచినవారికి మార్చి 8వ తేదీ నుంచి ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. మార్చి 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు ఉంటాయని ప్రకటించింది టెన్ సెట్ కంపెనీ ప్రకటించింది. కాగా ఈ ఈవెంట్ ఈవెంట్‌లో ప్రో ప్లేయర్లు.. సెమీ ప్రో ప్లేయర్లు పాల్గొనవచ్చునని ప్రకటించారు. ప్రపంచంలోని 10 రీజియన్‌లో ఈ గేమ్ ఆడేందుకు అవకాశం ఉంది. ఏషియన్ మొత్తాన్ని ఓ రీజియన్ గా ఎంపిక చేశారు. మొదటి రిజియన్ వారీగా పోటీలు నిర్వహిస్తారు. వీళ్లందరినీ కలిపి ఓ గేమ్ పెడతారు. అందులో గెలిచిన వారిని విజేతగా ప్రకటిస్తారు. మొత్తం 14 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని విడతల వారీగా.. అందజేస్తారు. ఎంట్రీ లెవల్ నుంచి క్యాష్ ప్రైజ్ లు ఉంటాయి. ఏడాదిపాటు ఈ గేమ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బిగ్గెస్ట్ చికెన్ డిన్నర్ దక్కిన వారు ఈ పోటీలో విజేతలు కానున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్లు గేమ్ అఫిషియల్ వెబ్‌సైట్ www.pubgmobile.com ద్వారా నమోదు చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది.