అందరి టార్గెట్ రిషబ్ పంతే!

SMTV Desk 2019-03-12 16:29:46  india vs australia, 4th odi, rishab pant, mahendra singh dhoni, virat kohli

న్యూఢిల్లీ, మార్చ్ 12: భారత్, ఆసిస్ మధ్య మొహలీలో జరిగిన నాలుగో వన్డేలో టీంఇండియా ఘోరంగా పరాజయపాలైన పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందరూ పంత్ పైనే విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరిసిన పంత్ కీపర్‌గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు స్టంపౌంట్లు చేయడంలో విఫలమైన పంత్ భారత్ ఓటమికి కారణమయ్యాడు. సెంచరీ హీరో హ్యాండ్స్‌కాంబ్‌ది కాగా మరొకటి తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు విజయాన్నందించిన టర్నర్‌ది. చివర్లో భారీ షాట్లతో చెలరేగి ఆడుతోన్న టర్నర్‌ను స్టంపౌంట్ చేసే అవకాశం వచ్చినా. ధోనీ తరహాలో ప్రయత్నించి పంత్‌ విఫలమయ్యాడు. దీంతో నీ ఆట నువ్వు ఆడు. మహిలా ట్రై చేయకు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పంత్‌ను ట్రోలింగ్ చేస్తున్నారు. ధోనీకి విశ్రాంతినివ్వడం కూడా కరెక్ట్ కాదంటూ అభిప్రాయడుతున్నారు.