హాట్ హాట్ ఫోటో షూట్ లో సమంత ..

SMTV Desk 2019-03-12 16:21:43  samnatha,

హైదరాబాద్, మార్చ్ 12: టాలీవుడ్ భామ సమంత మరోసారి రెచ్చిపోయింది. అక్కినేని కోడలు అయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి వారం రోజులకు ఒకసారి హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది సమంత అక్కినేని. ఆ మధ్య ఈమె చేస్తున్న హాట్ ఫోటోషూట్ పై నాగార్జున కాస్త సీరియస్ అయినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పద్ధతిగా ఉన్నట్లు కనిపించినా సమంత ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోయింది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో అమ్మడు చేసిన ఫోటోషూట్ హాట్ హాట్ గా అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు అప్ లోడ్ చేస్తూ ఫాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుంటుంది సమంత. ఇప్పుడు కూడా ఇదే చూసింది ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసింది ఇవి చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈసారి కూడా అ అమ్మడు ఫుల్ గా రెచ్చిపోయే సరికి నాగార్జున నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరోవైపు సమంత మాత్రం తనకు నచ్చిన పని తాను చేస్తూ పోతుంది. ఈ విషయంలో ఎవరి సలహాలు తనకు అవసరం లేదు అంటోంది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని కోడలిగా తన పరిధి ఏమిటో తనకు తెలుసని కుటుంబ పరువు పోయేలా తాను ఏమీ చేయను అంటోంది సమంత అక్కినేని.