షార్ప్ నుండి మరో కొత్త ఎయిర్ ప్యూరిఫైర్‌ విడుదల

SMTV Desk 2019-03-12 16:18:49  Sharp KC-G40M-W , SHARP KC-G40M Air Purifier with Humidifier

మార్చ్ 12: ఎలక్ట్రానిక్స్ తయారి సంస్థ షార్ప్ మరో నూతన వస్తువును విడుదల చేసింది. జీ40ఎం పేరిట మరో కొత్త ఎయిర్ ప్యూరిఫైర్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో షార్ప్.. కేసీ-హ్యుమిడిఫైర్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల గదిలో ఉండే గాలి నాణ్యంగా మారడమే కాదు, అవసరమైన తేమ కూడా ఉంటుంది. అలాగే ఈ ప్యూరిఫైర్ గాలిలో ఉండే ప్రమాదకరమైన కాలుష్య కారకాలను గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. దీంతో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఇక ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ధర రూ.33వేలు కాగా దీనిపై 1 ఏడాది ఆన్‌సైట్ వారంటీ వినియోగదారులకు లభించనుంది.