ఉత్త‌మ్ ఓ సైకో..

SMTV Desk 2019-03-12 16:15:52  trs, chirumarthi

కాంగ్రెస్ పార్టీ త‌రుపున నల్ల‌గొండ జిల్లా న‌కిరేక‌ల్ నుంచి గెలిచిన చిరుమ‌ర్తి లింగ‌య్య పార్టీని వీడ‌తున్న విష‌యం తెలిసిందే. కేసీఆర్ నేతృత్వంలోని తెరాస‌లో చేరుతున్న ఆయ‌న గ‌త కొంత కాలంగా అజ్ఞానతంలో వుంటున్నారు. సెల్ ఫోన్ కూడా స్విఛాఫ్ చేసిన ఆయ‌న తాజాగా అజ్ఞాతం వీడి వెలుగులోకి వ‌చ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. తెలంగాణ స‌చివాలయంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఆయ‌న ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైకోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయాంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఉత్త‌మ్ వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌కే పార్టీ మార‌డానికి నిర్ణ‌యించుకున్నాన‌ని, కాంగ్రెస్‌లో ద‌ళితుల‌కు గౌర‌వం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఉత్త‌మ్ త‌న నీడ‌ను తానే న‌మ్మ‌డం లేద‌ని, అంత సైకోలా వ్య‌వ‌హ‌రించ‌డం బాధించింద‌ని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ సార‌థ్యంలో జ‌రుగుతున్న అభివృద్ధి కార‌ణంగానే ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలంతా తెరాలోకి వ‌ల‌స వెళ్తున్నార‌ని, ఆయ‌న ఆదేశాల మేర‌కే ప‌నిచేస్తామ‌ని చిరుమ‌ర్తి లింగ‌య్య స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. టీ కాంగ్రెస్ అధినాయ‌కుడిపై స‌ద‌రు నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.