ప్రియా వారియర్ సంచలన వాఖ్యలు

SMTV Desk 2019-03-12 16:14:26  Priya warrior,

కేవలం కన్నుకొట్టడంతోనే రాత్రికి రాత్రే స్టార్ అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్… ఆమె మలయాళంలో నటించిన ‘ఒరు అడార్‌ లవ్‌’, తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో విడుదలవగా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దానికి కారణం ప్రియా వారియర్ అని సినిమా బృందం అంటున్నారు. కాగా ఈ సంఘటనపై స్పందించిన ప్రియా కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అసలు నిజానికి ఈ సినిమాలో తనది మెయిన్ రోల్ కాదంట… ఆమె కన్నుగీటిన వీడియో సంచలనం కావడం కారణంగా నిర్మాతలు బలవంతపెట్టి మరీ స్క్రిప్ట్ మార్పించారని తెలిపాడు దర్శకులు ఒమర్‌ లులు. కాగా ఈ సినిమా అంతగా ఆడకపోవడానికి ప్రియనే కారణమని ఆ దర్శకుడు విమర్శలు చేశారు. న్యూరిన్ షరీఫ్ కూడా తనకు ఈ సినిమా ద్వారా చాలా నష్టపోయానని చెప్పుకొచ్చారు.

ఈ విషయం మీద స్పందించిన ప్రియా వారియర్… అసలేం జరిగిందో చెబితే తనను విమర్శిస్తున్న వారి పరువు పోతుందని తెలిపింది. తాను ‘కర్మ’ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం చెబితుందని ప్రియా చెప్పింది. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని సమాధానం చెప్పారు… కానీ అనవసరమైన విమర్శలు నేను పట్టించికోనని ప్రియా స్పష్టం చేశారు.