హైదరాబాద్, మార్చ్ 12: పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమా నటుడే కావచ్చు. విద్యావంతుడు కాకపోయి వుండొచ్చు. కానీ ప్రజలకి సేవ చేయాలనే అపార మైన తపన వుంది. అలాగే వారికి ఏమి చేయాలనే దానిపై ఆలోచన, అవగాహన వుంది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినపుడు, తగినంత ఆర్థిక బలం, బలగం లేనపుడు సపోర్ట్ కోసం పక్క చూపులు చూడడం సహజం. ఏ పక్క నుంచి కాస్త సపోర్ట్ వచ్చినా అల్లుకుపోవాలని చూస్తుంటారు. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం సినిమాని, రాజకీయాలని వేరు చేసి చూస్తున్నాడు. స్నేహానికి, ప్రజా సేవకీ ముడి పెట్టడానికి అస్సలు ఇష్టపడడం లేదు.
అందుకే తనకి అత్యంత ఆప్త మిత్రులకి రాజకీయాల్లో అడుగు పెట్టాలనే కోరిక వున్నా కానీ పవన్‌కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు. తన స్టార్‌డమ్‌కి ఆయా వ్యక్తుల సినిమా గ్లామర్ తోడయితే గ్యారెంటీ సీట్లు లెక్కేసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ అలాంటి లెక్కలు వేసుకోకుండా చిత్తశుద్ధి వున్న వారికే సీట్లు ఇస్తున్నాడు. అర్హులు కాదనిపించిన వారు తన స్నేహితులైనా సరే వారిని దూరంగా పెడుతున్నాడు. ఈ విషయంలో పవన్‌కళ్యాణ్ నిబద్ధతని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. కేవలం అధికారం కోసమో, సీట్ల కోసమో చూడకుండా పవన్‌కళ్యాణ్ తను నమ్మిన దానికి కట్టుబడి వుంటున్నాడని మెచ్చుకుంటున్నారు.ఇక ఇప్పుడు ఈ మేటర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది ..