రాహుల్ బ్రాహ్మణుడే అనడానికి DNA ప్రూఫ్ ఉందా

SMTV Desk 2019-03-12 13:26:21  rahul gandhi

న్యూ ఢిల్లీ, మార్చ్ 12: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉన్న కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి నోటి దురుసును ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని హైబ్రీడ్ అన్నారు. ముస్లిం తండ్రికి, క్రిస్టియన్ తల్లికి పుట్టిన బిడ్డ బ్రాహ్మణుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాహుల్ బ్రాహ్మణుడే అనడానికి DNA ప్రూఫ్ ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యానాలు కర్ణాటకలో దుమారాన్ని రేపుతున్నాయి.

ఇవాళ (సోమవారం) కర్ణాటకలోని శిర్సి పట్టణంలో బీజేపీ కార్యకర్తలతో ఏర్పాటైన సమావేశంలో అనంత్ కుమార్ పాల్గొన్నారు. తాను కాశ్మీరీ బ్రాహ్మణుడినని, జంధ్యం ధరిస్తానంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అనంత్ కుమార్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాహుల్ ను బ్రాహ్మణుడిగా గుర్తించడానికి DNA పరీక్షలు చేయాలని అన్నారు. ముస్లింనని రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ స్వయంగా చెప్పారని అన్నారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులపై రాహుల్ గాంధీ సాక్ష్యాలు అడగటంలో అర్థం లేదన్నారు అనంత్ కుమార్.